Telugu News » Collegium: కొలీజియం సిఫార్సులు.. ‘సుప్రీం’కు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం..!

Collegium: కొలీజియం సిఫార్సులు.. ‘సుప్రీం’కు ముగ్గురు న్యాయమూర్తుల నియామకం..!

ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం ఆ సిఫార్సులో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు న్యాయమూర్తులను(supreme court Judge’s) నియమించింది.

by Mano
supreme

సుప్రీంకోర్టు(Supreme court)లో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం (Collegium) చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం ఆ సిఫార్సులో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు న్యాయమూర్తులను(supreme court Judge’s) నియమించింది.

supreme

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్(Dhananjaya Yeshwant Chandrachud) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టీన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లను ఆమోదించింది.

జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తొలిసారిగా 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ 2008లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సందీప్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా చేసి గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల సంఖ్య ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 31 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. కొలీజియం సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి అధికారం వచ్చినట్లయింది. ఎలా అంటే.. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఇటీవల అక్టోబర్ 20న పదవీ విరమణ చేయగా, జస్టిస్ వి రామసుబ్రమణ్యం, జస్టిస్ కృష్ణ మురారి వరుసగా జూన్, జూలైలో పదవీ విరమణ చేశారు.

You may also like

Leave a Comment