సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల మూమెంట్ చూసి బీఆర్ఎస్(BRS) సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA HARISH RAO) సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) ఇరకాటంలో పడవేశారు. ఆయన వేసిన స్కెచ్‌కు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి బలయ్యేలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
కానీ, ఇప్పటికే నాలుగు నెలలు పూర్తవడానికి వస్తున్నా ఆరుగ్యారెంటీలను పూర్తిగా అమలుచేయలేదు.దీనికి తోడు రైతుల రుణమాఫీ, వడ్ల కొనుగోలు అంశం ప్రస్తుతం సీరియస్‌గా మారింది. ఇటీవల మెదక్‌కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి జిల్లాకు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. తాను పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని.. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని సవాల్ విసిరారు.
దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం గన్ పార్కు వద్దకు తన రాజీనామా లేఖను తీసుకొస్తానని.. రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేసినట్లు లేఖ తీసుకుని రావాలని సవాల్ విసిరారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, రైతురుణమాఫీ చేస్తే వెంటనే తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు ఇవ్వాలని.. లేకపోతే సీఎం తన రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వాలని సవాల్ విసిరారు.
నేటి ఉదయం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గన్ పార్కు వద్దకు వస్తున్నా.. తన రాజీనామా లేఖను తీసుకొస్తున్నా..సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా? అని సవాల్ విసిరారు. ఇపుడు సీఎం రాకపోతే దీనిని రాజకీయంగా వాడుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ చూస్తోంది. కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ హామీలను నెరవేర్చదని పొలిటికల్‌గా డ్యామేజ్ చేయాలని హరీశ్ రావు స్కెచ్ వేశారని టాక్ వినిపిస్తోంది.