కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్‌పీజీ(LPG) గ్యాస్ సిలిండర్ ధరను రూ.39.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
గ్యాస్ సిలిండర్లను హోటల్స్, రెస్టారెంట్లలో వినియోగించే సిలిండర్ ధరలను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.39.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, వంట గ్యాస్ ధరలు మాత్రం యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.
దీనితో ఢిల్లీలో రిటైల్ 19కేజీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,796.50 నుంచి రూ. 1757లకు తగ్గింది. రిటైల్ 19కేజీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు కోల్‌కతాలో రూ.1,868.50కు, చెన్నైలో రూ.1929, ముంబయిలో రూ.1,710కు చేరుకున్నాయి. ఓవర్ సప్లై భారత్ – సౌదీ అరేబియా మధ్య ఉన్న ఎల్పీజీ కాంట్రాక్ట్ ప్రైస్ బాగా తగ్గింది. సౌదీ నుంచి భారత్‌కు ఎల్పీజీ ఓవర్ సప్లై కావడమే ఇందుకు కారణం.
మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 21 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగానే ఉంచుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62లుగా ఉంది. ఎల్పీజీ సిలిండర్, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను అసలు ధరలను ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు.