Telugu News » BANDI SANJAY : రైతులను నిండా ముంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్.. రైతు దీక్షలో బండి సంచలన వ్యాఖ్యలు!

BANDI SANJAY : రైతులను నిండా ముంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్.. రైతు దీక్షలో బండి సంచలన వ్యాఖ్యలు!

బీజేపీ జాతీయ సెక్రటరీ, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi sanjay kumar) కరీంనగర్ జిల్లాలోని ఆయన కార్యాలయంలో రైతు దీక్ష(Raithu deeksha)ను మంగళవారం ప్రారంభించారు. ఆయన వెంట బీజేపీ నేతలు,కార్యకర్తలు పెద్దఎత్తున ఉన్నారు.

by Sai
Bandi Sanjay: Inappropriate comments on Akshintha are inappropriate: Bandi Sanjay

బీజేపీ జాతీయ సెక్రటరీ, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi sanjay kumar) కరీంనగర్ జిల్లాలోని ఆయన కార్యాలయంలో రైతు దీక్ష(Raithu deeksha)ను మంగళవారం ప్రారంభించారు. ఆయన వెంట బీజేపీ నేతలు,కార్యకర్తలు పెద్దఎత్తున ఉన్నారు. బండి సంజయ్ ముందుగా చెప్పిన విధంగా నేడు కలెక్టరేట్ వద్ద రైతు దీక్ష పేరుతో నిరసన చేపట్టడానికి వెళ్తుండగా.. చివరి నిమిషయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు.

Congress, BRS, which overwhelmed the farmers

ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. దీంతో బండి తన ఎంపీ ఆఫీసులోనే రైతు దీక్ష చేయాలని నిర్ణయించారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తారని బీజేపీ శ్రేణులు ముందుగానే గ్రహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. రైతు దీక్ష ప్రారంభించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.

100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. వంద రోజులు పాలన పూర్తయినా హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో పాటు 500 బోనసు ఇస్తామన్నారు.దీనిపై‌ నేటికి స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కారు తరుగు,తాలు‌ పేరుతో రైతులను దోచుకుంది. ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ తప్పతాలు,తరుగు లేకుండా పండించిన పంటని కొనాలి. వడగండ్లు, నీరు లేక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కింద రూ.20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని మంత్రులు చెప్పారు. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు.రైతు భరోసా పేరుతో కౌలు రైతులకు రూ.15000 ఇస్తామన్నారు అది కూడా దిక్కులేదన్నారు.తెలంగాణలో పసల్ భీమా అమలు‌ చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment