ఎవడి పాలు అయ్యిందిరో తెలంగాణ అంటూ ఉద్యమకారులు ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS)అవినీతిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లో కారుపై వ్యతిరేకత వచ్చేలా ఎత్తులు వేస్తుందని అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా హస్తం అభ్యర్థులు అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ.. కారును స్క్రాప్ కు పంపించడాని తీవ్రంగానే కృషి చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తన నియోజక వర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్థిని మరచిన బీఆర్ఎస్ కు బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ (KCR)ని గద్దె దింపాలని ధర్వేశిపురం నుంచి మంచినీళ్ల బావి వరకు కోటి రూపాయలతో రోడ్డు వేయించానని పేర్కొన్నారు..
రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశానని, రూ. 50 లక్షలతో సబ్ స్టేషన్, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు వేయించానని కోమటి రెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రాబందుల పాలయిందన్న వెంకటరెడ్డి.. మూడవసారి కేసీఆర్ గెలిస్తే రాష్ట్ర ప్రజల బతుకులు బానిస బతుకులు అవుతాయని ఆరోపించారు.
ఉపాధి పథకం ద్వారా ప్రజలకు పని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపిన వెంకటరెడ్డి.. ప్రాజెక్టులో ఆవినీతిగా సంపాదించిన సొమ్ముతో ఓటర్లను కొనేందుకు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని విమర్శించారు. 15 రోజుల్లో ఎమ్మెల్యేగా వస్తానన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి.. మీరందరూ కష్టపడి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.