Telugu News » Jagga Reddy : నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ వా…. కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్…!

Jagga Reddy : నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ వా…. కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్…!

కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసేంత దమ్ము కేటీఆర్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా? అని ఫైర్ అయ్యారు.

by Ramu
congress leader jaggareddy slams on ktr and brs

బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీసేంత దమ్ము కేటీఆర్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా? అని ఫైర్ అయ్యారు.

congress leader jaggareddy slams on ktr and brs

తాము తొడగొడితే కేటీఆర్ గుండె అదురుతుందన్నారు. ఉద్యమ సమయంలో కోదండరాంను దేవుడి లెక్క చూశారని వెల్లడించారు. తొమ్మిదిన్నరేండ్లలో కోదండరాంకు బీఆర్ఎస్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంను బీఆర్ఎస్ వాళ్లు అగౌర పరిచారని ధ్వజమెత్తారు.

కానీ తాము ఎమ్మెల్సీ ఇచ్చి కోదండ రాంను గౌరవిస్తున్నామని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ చేయలేనిది..సీఎం రేవంత్ రెడ్డి ఒక్క నెలలో చేసి చూపించారని అన్నారు. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. బడ్జెట్ ను మొత్తం నాకి పడేశారని ఆరోపణలు గుప్పించారు.

అన్నం వండిన గిన్నెలో మాడు లేకుండా మొత్తం ఊర్చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సర్ఫ్ వేసి కడగాల్సి అవసరం లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వీ 420 హామీలు ఉన్నాయని విమర్శించారు. వాటిని అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బట్టలూడదీసి ఉరికించే రోజులు వస్తాయని కేటీఆర్ అన్నారు.

You may also like

Leave a Comment