Telugu News » Uttam-Kumar : ఒక్క ఓటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..!!

Uttam-Kumar : ఒక్క ఓటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. ఇక కేసీఆర్ (KCR)..కేటీఆర్ (KTR) మరీ దిగజారి మాట్లాడుతున్నారని.. వారు చెప్పినన్ని అబద్ధాల మాటలు తాను ఇప్పటి వరకు వినలేదని ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు.

by Venu
Uttam Kumar Reddy: 'Police in favor of the ruling party'.. Uttam's impatience..!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నేతలు విమర్శలకు పదునుపెడుతున్నారు.. ఇప్పటికే ప్రతి సమస్యను ప్రజల్లోకి తీసుకు వస్తున్న నేతలు వారితప్పులు వారే భయటపెట్టుకుంటున్నారని జనం అనుకుంటున్నారు. తాజాగా నల్గొండ (Nalgonda)ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam-Kumar-Reddy) బీఆర్ఎస్ (BRS)పై మండిపడ్డారు.

బీఆర్ఎస్ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. ఇక కేసీఆర్ (KCR)..కేటీఆర్ (KTR) మరీ దిగజారి మాట్లాడుతున్నారని.. వారు చెప్పినన్ని అబద్ధాల మాటలు తాను ఇప్పటి వరకు వినలేదని ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఉద్యమకారునిగా అంచనాలు పెంచిన కేసీఆర్.. తన స్థాయిని తనకు తానే తగ్గించుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు..

50 వేలకు ఒక్క ఓటు తగ్గిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపిన ఉత్తమ్.. మీ అవినీతి రుజువైతే మీరు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయం మాకు కొత్తకాదని.. నమ్మించి రాజకీయాలు చేయడం లేదన్న ఉత్తమ్.. 35 సంవత్సరాలుగా మేము ప్రజల్లోనే ఉన్నామని … ప్రజా సమస్యలపైనే పని చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కొత్త ఉద్యోగం దేవుడు ఎరుగు.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పాటూ నిరుద్యోగుల కోసం పెట్టిన మ్యానిఫెస్టో పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తుందని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ నేతల్లాగా తాము బెదిరించుకుని బతకడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. దళిత బంధు, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు అందరికీ అందేలా చూసే బాధ్యత మీకు లేదు. కానీ కమిషన్ల కోసం కూలిపోయే ప్రాజెక్టులు కట్టి.. ప్రజా ధనాన్ని వృధా చేయడం తెలుసని ఉత్తమ్ మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 75 సీట్లుకు పైగా కాంగ్రెస్ (Congress) గెలిచి తీరుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

You may also like

Leave a Comment