Telugu News » BRS : బీఆర్ఎస్ భయపడుతోందా..?

BRS : బీఆర్ఎస్ భయపడుతోందా..?

తాము కక్షసాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఏం జరిగేదో ఆలోచించాలని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. తమ కంటే ఎక్కువ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారుగా అవి తప్పుడు హమీలు కాదా? అంటూ కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు.

by admin

– ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్
– అన్ని శాఖలపై పూర్తిస్థాయి పట్టు
– కీలక అంశాలపై సమీక్షలు, సమావేశాలు
– త్వరలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
– గులాబీల్లో అలజడి మొదలైందా..?
– కేటీఆర్, హరీష్ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

తెలంగాణ (Telangana) లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ (Congress) సర్కార్ తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉంది. ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని శాఖలతో సీఎం రేవంత్ (CM Revanth), మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, వారికి రాష్ట్ర ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శేతపత్రం విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని చూస్తున్నారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. బీఆర్ఎస్ (BRS) పార్టీ మాత్రం ఎటాక్ మొదలు పెట్టింది. కేసీఆర్ (KCR) ఆస్పత్రిపాలు కావడంతో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న గులాబీ నేతలు స్వరం పెంచుతున్నారు. కానీ, దీని వెనుక భయం మాత్రమే ఉందనేది కాంగ్రెస్ వాదన.

congress-leaders-are-criticizing-brs-leaders

బీఆర్ఎస్ హయాంలో పథకాలు ఎన్ని అమలయ్యాయో.. వివాదాలు అంతకంటే ఎక్కవ ఉండేవి. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన తీరును.. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అనేక సందర్భాల్లో ఎండగట్టింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలో ఉంది. దీంతో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి లెక్కలన్నీ బయటకు వస్తాయని అంతా అనుకుంటున్నారు. దీనికి తగ్గట్టే సీఎం రేవంత్ అన్ని శాఖల అధికారులతో సమావేశమవుతూ అన్నీ తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నట్టుగా వాళ్ల వ్యాఖ్యలను చూస్తే అర్థం అవుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన మాజీ మంత్రి కేటీఆర్… ప్రభుత్వ శ్వేతపత్రాలపై మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగ్ రిపోర్టులు, ఆడిట్ రిపోర్టులు ఉన్నాయని… వాటి కంటే శ్వేతపత్రాల్లో ఏముంటాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై బురద జల్లడానికే హస్తం నేతలు ప్రయత్నిస్తారని చెప్పారు. వారంలో రుణమాఫీ అన్నారని ఏమైందంటూ ప్రశ్నించారు. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని.. అసలు ఆట ముందుందంటూ సెటైర్లు వేశారు. అలాగే, హరీష్ రావు మాట్లాడుతూ.. తాము కక్షసాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఏం జరిగేదో ఆలోచించాలని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. తమ కంటే ఎక్కువ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారుగా అవి తప్పుడు హమీలు కాదా? అంటూ కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు.

కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు తినేశారని.. మిషన్ భగీరథ ఇతర పథకాల్లోనూ కమీషన్లు దండుకున్నారని ఇప్పుడు అవన్నీ బయటపడి పరువు పోతుందనే భయంతోనే గులాబీ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు హస్తం నేతలు. గులాబీ తప్పుల్ని నిరూపిస్తామని భావించి.. హరీష్ రావు, కేటీఆర్ హెచ్చరిస్తున్నారని ఫైరవుతున్నారు. ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేసి.. ఇప్పుడు నీతులు చెప్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన దోపిడీ గురించి శ్వేతపత్రాలతో జనానికి వివరిస్తామని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

You may also like

Leave a Comment