Telugu News » Congress : వికాస్ రాజ్ తో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు..?

Congress : వికాస్ రాజ్ తో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు..?

రైతు బంధు నిధులు దారి మళ్లిస్తున్నారని వికాస్ రాజ్ కు హస్తం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కోరారు. సీఈవోతో భేటీ అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

by admin
Congress Leaders Meets Telangana CEO Vikas Raj

– ఎన్నికల ప్రధాన అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ
– నిధుల విడుదల విషయంలో అభ్యంతరం
– కేసీఆర్ అంతా దారి మళ్లిస్తున్నారని ఫిర్యాదు
– 4 అంశాలపై ప్రధానంగా చర్చ
– ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని వినతి

ఎన్నికల వేళ రైతు బంధు అంశం అనేక వివాదాలకు కారణమైంది. ఎలక్షన్ కు చాలారోజుల ముందే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ (Congress) ఈసీని కోరింది. అయితే.. రైతు ద్రోహులు అంటూ బీఆర్ఎస్ ఎటాక్ చేసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈసీ పర్మిషన్ ఇవ్వగా.. దీనిపై హస్తం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అనూహ్యంగా ఎన్నికల సంఘం నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. రైతు బంధు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ (Vikas Raj)‌ తో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది.

Congress Leaders Meets Telangana CEO Vikas Raj

రైతు బంధు నిధులు దారి మళ్లిస్తున్నారని వికాస్ రాజ్ కు హస్తం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని కోరారు. సీఈవోతో భేటీ అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై వికాస్‌ రాజ్‌ ‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఎలాంటి అధికారం లేకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని అన్నారు. రెండు, మూడు రోజులుగా అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఫిర్యాదు చేసినట్టుగా వివరించారు. భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.

లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌ వెల్లడించారు. వికాస్ రాజ్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి సహా పలువురు నేతలు ఉన్నారు. బీఆర్కే భవన్ లో ఈ సమావేశం జరిగింది.

You may also like

Leave a Comment