Telugu News » Tummala : కాంగ్రెస్ లోకి తుమ్మల.. ఆల్ క్లియర్!

Tummala : కాంగ్రెస్ లోకి తుమ్మల.. ఆల్ క్లియర్!

ఈ నెల 17న హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఇదే సభ నుంచి పలు పథకాలను ప్రకటించి... ఎన్నికల శంఖారావం పూరించనున్నారు హస్తం నేతలు.

by admin
congress-leaders-meets-tummala-nageswara-rao

– కాంగ్రెస్ లో తుమ్మల చేరికపై క్లారిటీ వచ్చిందా?
– 17న చేరికకు ముహూర్తం ఫిక్స్ అయిందా?
– తుమ్మలతో కాంగ్రెస్ అగ్ర నేతల భేటీ
– ఇదే బాటలో పలువురు కీలక నేతలు

కాంగ్రెస్ (Congress) పార్టీలోకి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చేరికపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లూ వెళ్తారా? లేదా? అనే సస్పెన్స్ కు తెరపడింది. కాంగ్రెస్ అగ్ర నేతలు మాణిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హైదరాబాద్ (Hyderabad) లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. ప్రత్యేకంగా భేటీ అయిన వీరు తుమ్మల జాయినింగ్ పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన 17న తుక్కుగూడ సభలో చేరేందుకు సుముఖత చూపినట్టు వార్తలు వస్తున్నాయి.

congress-leaders-meets-tummala-nageswara-rao

ఈ నెల 17న హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఇదే సభ నుంచి పలు పథకాలను ప్రకటించి… ఎన్నికల శంఖారావం పూరించనున్నారు హస్తం నేతలు. ఇదే సభలో భారీగా చేరికలు ఉంటాయని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలతో చర్చలు జరిపిన నేతలు.. చేరికపై హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది.

పాలేరు నుంచి బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించారు తుమ్మల. కానీ, ఆయనకు ఝలక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్ధిగా మరోసారి కందాల ఉపేందర్ రెడ్డికే అవకాశం కల్పించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీలోకి దిగాలని తుమ్మల ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే.. అభిమానులు కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా తుమ్మలతో భేటీ కాగా.. శుక్రవారం అందరూ కలిసి థాక్రేను వెంటబెట్టుకుని కలిశారు. బీఆర్ఎస్‌ లో సీటు దక్కకకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. పాలేరు టికెట్ తోపాటు అధిక ప్రాధాన్యత ఇస్తామనిఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కీలక హామీతో తుమ్మల 17న చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇటు తుమ్మలతోపాటు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, వేముల వీరేశం, నల్లాల ఓదెలు తదితరులతో పాటు ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ ఛైర్మన్లు తదితరులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

You may also like

Leave a Comment