మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి(malireddy sudheerreddy) కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanthreddy) ఆయన నివాసానికి వెళ్లి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. 45ఏళ్ల తన రాజకీయ అనుభవంలో ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు.
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అవినీతిమయం చేశాడని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మల్లారెడ్డిని ఓడించాలని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను ఇప్పుడే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేడ్చల్ నియోజకవర్గానికి ఐటీ హబ్‌ను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీని ద్వారా మేడ్చల్ నియోజకవర్గం ఐటీ కంపెనీలతో కళకళలాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుతుందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరైనా తనకు అభ్యంతరం లేదని రేవంత్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే స్థానాన్నే తాను తీసుకుంటానని చెప్పారు. పార్టీలో కష్టపడ్డ నాయకులందరికీ తగిన ప్రధాన్యత కల్పిస్తామన్నారు. హరివర్దన్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌లకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వెల్లడించారు. సుధీర్‌రెడ్డిని మేడ్చల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.