పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది. ఇందులో భాగంగా అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కనిపిస్తోంది.. అదేవిధంగా హామీలతో హోరెత్తిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కొన్ని చోట్ల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. కాగా రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు.

అయితే రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి (India Alliance) శ్రమిస్తున్నాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi)పేర్కొన్నారు.. తాము ప్రజల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వివరించారు.. అలాగే తమది విప్లవాత్మక మేనిఫెస్టో అని వెల్లడించారు. ఇందులో ఐదు ప్రధాన గ్యారెంటీలను అందించామని తెలిపారు..
ఇక తాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపిన రాహుల్.. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పర్యటించానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజల జీవన గతులు, వారి కష్టాలు దగ్గరగా చూస్తే మనస్సు చలించిందన్నారు.. నరేంద్ర మోడీ దేశానికి 22-25 మంది మిలియనీర్లను తయారు చేస్తే, తాము కోట్లాది మహిళలు, యువతను లక్షాధికారులుగా మారుస్తామని, అదేవిధంగా రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని భరోసా ఇచ్చారు..