Telugu News » AP Congress : ఏపీలో గెలుపు కోసం కాంగ్రెస్‌ స్కెచ్..ఏడు గ్యారెంటీలతో ముందుకు..!!

AP Congress : ఏపీలో గెలుపు కోసం కాంగ్రెస్‌ స్కెచ్..ఏడు గ్యారెంటీలతో ముందుకు..!!

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయడానికి ఏపీ కాంగ్రెస్‌ సిద్దంగా ఉన్నట్టు సమాచారం.

by Venu

-ఏపీపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌..
– ఏడు గ్యారెంటీలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం..

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా.. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. పునర్వైభవం తెచ్చుకోనేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం దానికోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది.

telangana congress cm swearing ceremony telangana assembly election results 2023

తాజాగా.. ఢిల్లీ (Delhi)లో జరిగిన సమావేశంలోనూ ఏపీ కాంగ్రెస్‌ నేతలకు కీలకాంశాలపై దిశానిర్ధేశం చేశారు ఏఐసీసీ అగ్ర నేతలు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఏపీ కాంగ్రెస్‌ సమన్వయ భేటీలో.. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలంతోపాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయడానికి ఏపీ కాంగ్రెస్‌ సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే సూచనలున్నట్టు ప్రచారం జరుగుతోంది. షర్మిల సేవలు ఉపయోగించుకోవడం వల్ల ఏపీలో కాంగ్రెస్ పుంజుకొనే అవకాశాలున్నట్టు భావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు అంధ్రప్రదేశ్‌లో మూడు సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సభలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకను ఏపీ పీసీసీ చీఫ్‌ రుద్రరాజు ఆహ్వానించినట్టు సమాచారం.. ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రజలని ఆకట్టుకోవడానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని సహా ఏడు గ్యారెంటీలతో ముందుకు వెళ్లాలని హస్తం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి కర్ణాటక, తెలంగాణలో వర్కవుట్ అయిన అంశాలు ఏపీలో కాంగ్రెస్ కు ఏమేరకు విజయాన్ని అందిస్తాయో అనే ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది.

You may also like

Leave a Comment