దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Covid Cases) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ (Telangana)లోనూ కొవిడ్ కేసులు(Covid Cases) చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్(Hyderabad)లోని ఉస్మానియా ఆస్పత్రి(Osmaniya Hospital)లో కరోనా సోకిన ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
అయితే, ఉస్మానియా ఆసుపత్రిలో కొవిడ్ మరణాల పై వస్తున్న వార్తలను ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ కొట్టిపారేశారు. కొవిడ్ మరణం కాదని, గుండెసంబంధిత సమస్యలతో వ్యక్తి మృతిచెందాడని తెలిపారు. ఎండీ సుభాన్ అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో ఉస్మానియాలో చేరాడని, అయితే యాదృచికంగా కొవిడ్ పరీక్షల్లో అతడికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే అతడు గుండె వైఫల్యంతోనే మృతిచెందాడని, అతడిది కొవిడ్ మరణం కాదని తెలిపారు. ఉస్మానియా ఐసోలేషన్ లో ముగ్గురికి కొవిడ్ చికిత్స అందిస్తున్నామని.. అయితే వారి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.
కాగా, ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది.
అదేవిధంగా, 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 69కి చేరాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.