Telugu News » Neglect : ఆపరేషన్ చేసి దూదిమరచిన వైద్యుడు…ఏమైందంటే..!

Neglect : ఆపరేషన్ చేసి దూదిమరచిన వైద్యుడు…ఏమైందంటే..!

వైద్యోనారాయణ అన్నారు పెద్దలు. వైద్యుడంటే దేవుడేనని ఇప్పటికీ కొందరి నమ్మకం. డాక్టర్లు బాధ్యతగా వ్యవహరిస్తే అది అక్షర సత్యం.

by sai krishna

Neglect : ఆపరేషన్ చేసి దూదిమరచిన వైద్యుడు…ఏమైందంటే..!

 

వైద్యోనారాయణ అన్నారు పెద్దలు. వైద్యుడంటే దేవుడేనని ఇప్పటికీ కొందరి నమ్మకం. డాక్టర్లు బాధ్యతగా వ్యవహరిస్తే అది అక్షర సత్యం.కానీ కొంత మంది వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool district)లో ఓ గవర్నమెంట్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే….దర్శన్గడ్డా(Darshangadda)తండాకు చెందిన గిరిజన మహిళ ‘రోజా’ నిండు గర్భిణి. తనకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 15వ తేదీన అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో రోజాను చేర్పించారు.


ఆమెకు డాక్టర్ కృష్ణ(Dr. Krishna)శస్త్ర చికిత్స చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజున వైద్యులు రోజాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు.

అనంతరం ఆమెను మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఇంటికి వెళ్లాక రోజాకు స్వల్ప రక్తస్రావం(Bleeding)మొదలైంది. మంగళవారం రోజున సమస్య ఎక్కవ కావడంతో ఆమెను మరోసారి అచ్చంపేట(Atchampeta) ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.

అక్కడి వైద్యులు..రోజాకు ఇది వరకే చికిత్స చేసిన డాక్టర్ కృష్ణ నిర్వహించే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.అక్కడికి తీసుకెళ్లాక సాయంత్రం వరకు కాలయాపన చేసి..అక్కడి వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సిఫారసు చేశారు. అనంతరం హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.


అక్కడ చికిత్స పొందుతూ రోజా మృతి చెందింది. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ కృష్ణ రోజా కడుపులో దూదిని మరచిపోవడం వల్లనే తీవ్ర రక్తస్రావం అయిందని దాని కారణంగానే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధిత కుటుంబ సభ్యులు మృత దేహంతో బుధవారం రోజున అచ్చంపేటలో రాస్తారోకో చేశారు. డాక్టర్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విప్ గువ్వల బాల్రాజు(Guvvala balaraju)బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

రోజా భర్త రిక్యా ఫిర్యాదు చేశారని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డా. కృష్ణను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్కుమార్( Dr. Ajay Kumar)తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Harishrao) ఆదేశాల మేరకు హాస్పిటల్లో కమిషనర్ విచారణ చేపట్టారు.

You may also like

Leave a Comment