తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Telangana Assembly Elections) బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి గెలుపు ధీమాతో ఉన్న మంత్రులు ఈసారి వెనుకపడ్డారు. తెలంగాణ మంత్రులు(Telangana Ministers) ఎర్రబెల్లి దయాకర్‌రావు, , పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వెనుకపడ్డారు.
కొడంగల్‌లో 12వేలకు పైగా ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. షాద్‌నగర్‌లో 1815 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. అంబర్‌పేట్‌లో బీఆర్ఎస్కు ఆధిక్యం ఉంది. కల్వకుర్తిలో 6వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. పాలేరులో 12 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. అశ్వరావుపేటలో భారీ లీడ్‌తో కాంగ్రెస్ దూసుకుపోతుంది.
ఇక అటు రెండు చోట్ల వెనుకంజలో ఈటల రాజేందర్ ఉన్నారు. అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మళ్లీ లీడ్ సాధించారు. కొత్తగూడెంలో సీపీఐకి భారీ మెజారిటీ వస్తోంది. ఖమ్మలో 8386 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఉన్నారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ ఘన విజయం సాధించారు. మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ గెలుపొందారు.