సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబుకు పట్టిన గతే సీఎం కేసీఆర్(CM KCR)కు పడుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు ఓట్లు వస్తాయని గతంలో అనుకున్నారు కానీ ఆయనకు ప్రజలు మూడు నామాలు పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా గెలుసాతమనే ఆలోచనలో ఉన్నారని, అయితే ప్రజలు ఈ ఎన్నికల్లోనే బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు.
ఆదివారం రోజు ప్రజాస్వామ్యం గెలుస్తుందని, అహంభావం ఓడిపోతుందని నారాయణ వ్యాఖ్యానించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అహంతోనే ఒడిపోనున్నారని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ నుంచి బహిష్కరించబడ్డ రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా అసెంబ్లీకి వెళ్లనున్నారని తెలిపారు.
కేసీఆర్‌కు సరిజోడీ మోడీ.. కానీ తెలంగాణలో రేవంత్ చేతిలో అవమానపాలు కానున్నారని అన్నారు. పార్టీలో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటే ప్రజాస్వామ్యం బతికే ఉంది అన్నట్లు నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనపై దళితులు, యువత ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ఓడిపోతుందనే సర్వే సంస్థలు బోగస్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు మొదలెట్టిందన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్‌కు వృద్ధులు ఓట్లు వేసినా యువత మాత్రం వేయలేదని నారాయణ చెప్పుకొచ్చారు.