తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)వేళ సీపీఎం(CPM) అభ్యర్థుల తొలి జాబితాను(First List) ఆ పార్టీ విడుదల చేసింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పాలేరులో తమ్మినేని వీరభద్రం, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ పొత్తు కోసం సీపీఎం ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, నిన్నటి వరకు పాలేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కందాల పోటీ చేస్తున్నారు. అక్కడ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజయం సులభంగా అందుకుంటారని అందరూ భావించారు.
పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీకి దిగడంతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజయం చాలా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు తమ్మినేని తెలిపారు. ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
సీపీఎం తొలి జాబితాలో తమ్మినేని వీరభద్రం (పాలేరు), కారం పుల్లయ్య (భద్రాచలం, ఎస్టీ), పిట్టల అర్జున్ (అశ్వారావుపేట, ఎస్టీ), భూక్యా ఎర్ర శ్రీకాంత్ (ఖమ్మం), మాచర్ల భారతి (సత్తుపల్లి (ఎస్సీ), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), చినవెంకులు (నకిరేకల్, ఎస్సీ), కొండమడుగు నర్సింహ (భువనగిరి), మోకు కనకారెడ్డి (జనగామ), వీరభద్రం (వైరా, ఎస్టీ), పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం), జే మల్లికార్జున్ (పటాన్‌చెరు), పాలడుగు భాస్కర్ (మధిర, ఎస్సీ), ఎం దశరథ్ (ముషీరాబాద్) ఉన్నారు.