విశాఖ (Vizag) షిఫింగ్ హార్బర్ (Fishing Harbour) అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే యూ ట్యూబర్, లోకల్ బాయ్ నాని ఈ ప్రమాదానికి కారణంగా భావించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో యూ ట్యూబర్, లోకల్ బాయ్ నాని స్నేహితులతో కలిసి ఘటన స్థలంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు వెల్లడించారు.. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పలు కీలక విషయాలు తెలిపారు..
యూ ట్యూబ్‌లో తెగ ఫేమస్ అయిన లోకల్ బాయ్ నాని (Local Boy Nani) సముద్రంలో వేటకు వెళ్లి.. వలకు పడిన చేపల దృశ్యాలను.. యూట్యూబ్ (Youtube)లో అప్‌లోడ్ చేస్తాడు. అలా వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నాని.. హార్బర్‌లో జరిగిన ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అదీగాక ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని ఆ వీడియోలో చెప్పాడు.
అయితే ప్రమాదం జరిగాక నానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు.. ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని సమాధానం ఇచ్చాడు అతను అక్కడ లేకపోతే అగ్ని ప్రమాదం తాలూకు దృశ్యాలు యూ ట్యూబ్‌లో ఎలా పెట్టాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మొదటి బోట్ కు మంటలు అంటుకున్న సమయం రాత్రి 11.15 గంటలుగా పోలీసులు గుర్తించారు. 11.45 గంటలకు నాని అక్కడకి వచ్చినట్టు మొబైల్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు.
మరోవైపు తన బోట్ కాలిపోతుందన్న సమాచారంతోనే అక్కడకు వెళ్లానని నాని పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.. మొదట నాని చూట్టూ సాగిన విచారణ.. క్రికెట్ బెట్టింగ్ వైపు మళ్లింది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.. కాగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ స్థానిక యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు…