Telugu News » Telangana : రేవంత్ రెడ్డి ప్లాన్ కి బీఆర్ఎస్ నేతల్లో మొదలైన గుబులు..!!

Telangana : రేవంత్ రెడ్డి ప్లాన్ కి బీఆర్ఎస్ నేతల్లో మొదలైన గుబులు..!!

కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని, నిజామాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుటుంబసభ్యుల మిల్లులు ఉన్నాయని అధికారులు చెబుతోన్నారు. దీంతో వారి ఇళ్లలో సైతం అధికారులు తనిఖీలు చేపడుతోన్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో స్కామ్ జరిగినట్టు గుర్తించిన అధికారులు.

by Venu
tpcc-president-revanth-reddy-fires-on-ktr-and-kcr

పులి అడవిలో ఉన్నంత వరకి మాత్రమే సేఫ్.. ఒక్క సారి అడవిని వదిలిందా.. దాని బ్రతుకు దానికే తెలియదు. ప్రస్తుత రాజకీయ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మెక్కిన అవినీతి సొమ్ము.. కొత్తగా అధికారంలోకి వచ్చాక కక్కించడం కామన్.. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకి ఇలాంటి అనుభవం ఎదురవుతోందని తెలుస్తోంది.

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అవినీతి తిమింగలాలకి దడ మొదలైనట్టు తెలుస్తోంది. ఇందుకు రాష్ట్రంలో జరుగుతోన్న ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటికే నిజామాబాద్ (Nizamabad) జిల్లా, ఆర్మూర్ (Armor) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు షాకిచ్చారు.. ఆర్టీసీ కాంప్లెక్స్ అద్దె బకాయిలు, కరెంట్ ఛార్జీల బకాయిలతో పాటుగా.. ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి రూ.45 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని, నిజామాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుటుంబసభ్యుల మిల్లులు ఉన్నాయని అధికారులు చెబుతోన్నారు. దీంతో వారి ఇళ్లలో సైతం అధికారులు తనిఖీలు చేపడుతోన్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో స్కామ్ జరిగినట్టు గుర్తించిన అధికారులు.. సుమారుగా రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు.

షకీల్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న మిల్లుల నుంచి రూ.9 కోట్ల బకాయిలు రావలసి ఉన్నందున పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లుల నుంచి భారీగా బకాయి పేరుకుపోవటంతో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్‌ జగదీశ్, తనిఖీ విభాగం సభ్యులతో కలిసి ఆయా మిల్లులకు అనుబంధంగా ఉన్న గోదాముల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని తనిఖీలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల జరుగుతోన్న వరుస ఘటనలతో బీఆర్ఎస్ (BRS) నేతల్లో గుబులు మొదలైందని ప్రచారం జరుగుతోంది..

You may also like

Leave a Comment