శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంట.. ఈలెక్కన గోల్డ్ స్మగ్లర్స్ కి ఇంకెన్ని ఉపాయాలుండాలి. బంగారం ఏ పనైనా చేయిస్తుంది. అలాగే..పుటం పెట్టిన బంగారం ఎలా చెబితే అలా వింటుంది.బంగారానికి ఉన్న బంగారం లాంటి ఈ క్వాలిటీని ఉపయోగించుకుని స్మగ్లర్స్ చిన్న ట్రిక్ ప్లే చేశారు.
కానీ వాళ్ల కష్టం వృద్ధా అయ్యింది. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ కి దొరికేశారు.
వివరాలలోకి వెళ్తే.. బెంగుళూరు(Bangalore)లో ఇద్దరు దుబాయ్ ప్రయాణికులు బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు.
ఆ బంగారపు బెల్టుని అక్రమ రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయం(Bangalore Airport)లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ..దుబాయి(Dubai)నుంచి ఇండియాకి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు.
వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని.. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 3 కేజీల గోల్డ్ ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 1.58 కోట్ల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.