Telugu News » Stock Market : లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు!

Stock Market : లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు!

ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ హైగా ఉంది

by Sai
stock market today

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market)  సోమవారం ట్రేడింగ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ(Nifty) ఇండెక్స్ 20 వేల మార్క్‌ను తాకింది. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ సైతం 67 వేల మార్క్ పైన ట్రేడింగ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుల్ జోరు కొనసాగుతోంది.

stock market today

లక్షల షేర్లు చేతులు మారాయి. నిఫ్టీ సరికొత్త రికార్డులు చేరుకున్న క్రమంలో స్టాక్ మార్కెట్లో ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లకు రూ. 3.4 లక్షల కోట్లు లాభాలు వచ్చాయి. ఈ క్రమంలో నిఫ్టీ ట్రాక్ రికార్డ్ ఓసారి పరిశీలిద్దాం.జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. ఈ ఏడాది జులై 20న తొలి సారి 19,991 మార్కును తాకింది. ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ హైగా ఉంది. అయితే, ఆ తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్‌లో కాస్త ఒడుదొడుకులు కనిపించాయి. ఆల్ టైమ్ హై నుంచి కిందకు పడిపోయింది.

అయినప్పటికీ గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలోనే బలంగా పుంజుకుంది. క్రితం రోజు అంటే సెప్టెంబర్ 8 ట్రేడింగ్‌లో నిఫ్టీ 19,819.95 మార్క్ వద్ద ముగిసింది. అక్కడి నుంచి ఇవాళ 180 పాయింట్లు పెరిగి తాజాగా 20 వేల మార్క్‌ను తాకింది. సరికొత్త గరిష్ఠాలను తాకేందుకు నిఫ్టీకి 36 ట్రేడింగ్ సెషన్స్ సమయం పట్టిందని చెప్పాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి నిఫ్టీ ఇండెక్స్ ఏకంగా 17 శాతం మేర పెరిగింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టేందుకు జీ20 సదస్సు ఊతమిచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జీ20 సదస్సు నేపత్యంలో స్టాక్ మార్కెట్ లో పాజిటివిటీ నెలకొందని, జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌కు దేశాధినేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించినట్లు తెలిపారు. ఇరవై దేశాల అధినేతలు ఏకతాటిపైకి వచ్చి తీసుకుంటున్న చర్యలతో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని మదుపర్లలో నమ్మకం పెరిగిందని తెలిపారు.

You may also like

Leave a Comment