సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఫలితాన్నివ్వడంలేదు. ఏడాదిగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ స్కామ్‌లు(Cyber Fraud) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు.

డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్య స్క్యామర్లు ఇచ్చిన టాస్క్‌లను టెకీ పూర్తిచేశాడు. అదనపు ఆదాయం ఆర్జించే క్రమంలో రూ.17లక్షలు పైగా పోగొట్టుకున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సైబర్ ఫ్రాడ్ వెలుగుచూసింది.
బాధితుడి ఖాతా నుంచి సొమ్ము దోచేసిన స్కామర్లు ఆ మొత్తాన్ని కొచ్చి, జైపూర్, మాల్ధా, ఇటార్సి వంటి భిన్న ప్రాంతాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియాలో వచ్చే లిక్స్‌ను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తొలుత డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత పెద్ద మొత్తంలో డబ్బును లాగుతున్న ఘటనలు పెరుగుతుండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.