Telugu News » Delhi : ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు..!!

Delhi : ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు..!!

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ (Kailash Gahlot) మాట్లాడుతూ.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III ఢిల్లీలో అమలులోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యవసరం కాని నిర్మాణ పనులు, BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్ల వాహనాలపై నిషేధం విధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.

by Venu
Delhi air quality nears severe zone

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నివసిస్తున్న జనం పరిస్థితి దారుణంగా మారిపోయింది.. ఒకవైపు చలితో సతమతం అవుతోన్న ప్రజలు.. ప్రస్తుతం వాయు నాణ్యత (Air Quality) దారుణంగా పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యానికి తోడు నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతో రోజురోజుకి పరిస్థితి తీవ్రమవుతోంది.

Delhi Weather: Big relief for Delhi.. Pollution is decreasing with rain..!

ఢిల్లీలో ఇప్పటికే నిర్మాణ పనులపై నిషేధం, వాహనాలపై ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు చలికాలం కావడంతో శనివారం ఉదయం పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. దేశ రాజధానిలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorology Department) అంచనా వేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీ అంతటా AQI క్రమంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి 405 పాయింట్లకు చేరింది.

ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ (Kailash Gahlot) మాట్లాడుతూ.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ III ఢిల్లీలో అమలులోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యవసరం కాని నిర్మాణ పనులు, BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్ల వాహనాలపై నిషేధం విధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే మంచిది, 51-100 కాస్త ఫర్వాలేదు..101-200 మధ్య మితమైనదిగా, 201-300 పేలవమైనది, 301-400 చాలా పేలవమైనదిగా, 401-500 తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI తీవ్రమైన ప్లస్ విభాగంలోకి వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు..

You may also like

Leave a Comment