దేశ రాజధాని ఢిల్లీ(Delhi) గాలి నాణ్యత సూచీ మరింత దిగజారిపోయింది. తాజాగా వెలువడిన కాలుష్య స్థాయి వివరాలు ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం(Air Pollution) ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కాలుష్యం ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు దేశ రాజధానిలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదైంది. https://www.aqi.in/ వెబ్‌సైట్ ప్రకారం గాలి నాణ్యత వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ ఇంజినీరింగ్ (డైట్ ఏరియా) రోహిణి ప్రాంతంలో కాలుష్య స్థాయి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
ఆదివారం డీటీఐ(DIT) ప్రాంతంలో ఏక్యూఐ(AQI) 1079గా ఉంది. ఇదీ కాకుండా, ఆనంద్ విహార్‌లో 909, అశోక్ విహార్ ఫేజ్-1 లో 908, అశోక్ విహార్ ఫేజ్-2 లో 949, మోడల్ టౌన్ 909, ఆనంద్ పర్వత ప్రాంతంలో 515 వద్ద ఏక్యూఐ నమోదైంది. ఇది ఆరోగ్యపరంగా ముప్పుకు దారితీస్తోంది.
ఢిల్లీలో వాయుకాలుష్యం మరోసారి అదుపు తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళితే జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాలుష్యం దృష్ట్యా ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని వాతావరణ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యమైన పని ఉన్నప్పుడే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.