లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi cm Aravind Kejiriwal) అనారోగ్యం (Health Issue)బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయనకు షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే దాదాపు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ వర్గాలు పేర్కొన్నాయి.
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్(Sugar Levels Down) పడిపోయిన క్రమంలో వైద్యులు వెంటనే ఆయనకు మెడిసిన్ ఇచ్చారు. కాగా, ముఖ్యమంత్రి బరువు తగ్గడంపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తిహార్ జైలుకు వెళ్లేముందు కేజ్రీవాల్ 55 కిలోలు ఉన్నారని, ప్రస్తుతం బరువు కాస్త తగ్గారని సమాచారం.
మెడిసిన్ అందించాక కేజ్రీవాల్ ఆరోగ్యం కాస్త కుదుట పడిందని, షుగర్ లెవల్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని జైలు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం తన సెల్లో యోగా, ధ్యానం చేశారని, తన బ్యారాక్లో వాకింగ్ చేశారని అధికారులు అప్డేట్ ఇచ్చారు.
ఇదిలాఉండగా, కేజ్రీవాల్ కోసం ఇంటి నుంచి భోజనం, ఆయన కోసం క్విక్ రెస్పాన్స్ మెడికల్ బృందాన్ని జైలు అధికారులు ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ రాత్రి ఆలస్యంగా నిద్దురపోతున్నారని.. ఆయనకు పరుపు, పిల్లో ఇచ్చినా నేల మీద పడుకుంటున్నారన్నారు. చదువుకోవడానికి ఆయన కోరిన మూడు పుస్తకాలు, తన మెడలో ధరించే లాకెట్ కూడా అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.