Telugu News » BRS : జంపింగ్ నేతలపై బీఆర్ఎస్‌కు అంత కోపం ఎందుకు..వారు నిజంగానే సొంత వారా?

BRS : జంపింగ్ నేతలపై బీఆర్ఎస్‌కు అంత కోపం ఎందుకు..వారు నిజంగానే సొంత వారా?

బీఆర్ఎస్ పార్టీకి (BRS) గుడ్ బై చెప్పిన నేతలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు చాలా వింతగా ఉంది. అసలు పార్టీలు మారడమే తప్పు అన్నట్లుగా వారు వేదాలు వల్లిస్తున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళితే విశ్వాసం లేనట్టేనా? విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డేనా?

by Sai
BJP-Congress colluded.. Here is BRS as a witness!

బీఆర్ఎస్ పార్టీకి (BRS) గుడ్ బై చెప్పిన నేతలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు చాలా వింతగా ఉంది. అసలు పార్టీలు మారడమే తప్పు అన్నట్లుగా వారు వేదాలు వల్లిస్తున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళితే విశ్వాసం లేనట్టేనా? విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డేనా? ఒక్కసారి పదేళ్లు వెనక్కివెళ్లి చూస్తే బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఎంత ఘనమైనదో ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తున్న వారికి కనువిప్పు కలుగుతుంది.

Why is BRS so angry with jumping leaders..are they really their own?

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. ఆ కాలంలో టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) పార్టీలో నుంచి ఎంత మంది ఆ పార్టీ గుర్తులపై గెలిచి గులాబీ పార్టీలో చేరలేదు. ఈ విషయాన్ని ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు అప్పుడే మరిచిపోయారా? రెండోసారి అధికారంలోకి వచ్చాక అధినేత కేసీఆర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకున్నారు.

పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని అప్పటి కాంగ్రెస్ నేతలు స్పీకర్‌‌కు ఫిర్యాదు చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీనికి తోడు ఒక పార్టీలో మూడింట రెండొంతుల సభ్యులు పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెడితే అప్పుడు అనర్హత వర్తించదని కేసీఆర్ కొత్త రాగం ఎంచుకున్నారు.

దీంతో వారందరినీ తమ పార్టీలో విలీనం చేసుకుంటున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఇలా దేశంలోనే పార్టీ ఫిరాంపుల్లో కొత్త శకానికి నాంది పలికారు. నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తించనప్పుడు మరి ఇప్పుడు ఎలా వర్తిస్తుంది. అధికార పార్టీకి చెందిన స్పీకర్ పార్టీ పాట జవదాటడు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు పడుతుందా? అది గులాబీ పార్టీ నేతలకు తెలీదా? తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

ఇక న్యాయపరంగా పోరాటానికి సిద్ధమైతే కోర్టు కూడా ఆ నిర్ణయం స్పీకర్‌కే వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే చట్టసభల నిర్ణయాల్లో కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోవు అన్న విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియదా? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై ఎక్కువగా హడావుడి చేస్తే అది బీఆర్ఎస్ ఘనచరిత్రను తిరిగి తవ్వుకున్నట్లే అవుతుందని కొందరు హితవు పలుకుతున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నవారంతా ఏదో ఒక పార్టీలో నుంచి వచ్చిన వారే. ఏదో కేసీఆర్ సొంత ఫ్యామిలీ బయటకు వెళ్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఎందుక అంత ఫీల్ అవుతున్నారనేది చిక్కుప్రశ్నగా మారింది.

You may also like

Leave a Comment