ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న మంత్రం డబ్బు.. దాదాపుగా అందరూ డబ్బు ఉంటే చాలు అన్ని అవసరాలు తీరిపోతాయి అనుకుంటారు. ఈ డబ్బు సంపాదించడానికి ఎన్నో అడ్డదారులు తొక్కుతారు.. చివరికి నలుగురిలో నవ్వులపాలై పరువు తీసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ఎయిర్పోర్ట్ (Airport)లో చోటు చేసుకుంది.
ఓ ప్రయాణికుడు బ్యాంకాంక్ (Bangkok) నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. చూపుకు దొరబాబులా ఉన్న ఆ బాబు పక్కా స్మగ్లర్ అని గుర్తుపట్టలేం.. అయితే ఎయిర్ పోర్టులోకి వచ్చిన వారిని నిశితంగా గమనించే కళ్ళు ఉంటాయని మరచినట్టు ఉన్నాడు. అందుకే ఫ్రూటీ (Fruity) లాంటి డబ్బాలు బ్యాగులో తెచ్చుకున్నాడు..
మామూలుగా ఫ్రూటీ డబ్బా లైట్ వెయిట్.. కానీ ఇతను తెచ్చిన ఫ్రూటీ డబ్బా కాస్త వెయిట్.. దీంతో అతనిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. ఆ వ్యక్తి బ్యాగ్ పరిశీలించగా ఏదో తేడాగా అనిపించింది. బరువు కూడా ఎక్కువ ఉండడంతో డబ్బాలను ఓపెన్ చేసి చూశారు. అందులో బ్లాక్ కలర్లో ఉన్న చిన్న బాక్సులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. సుమారు 4 కిలోల బరువున్న గోల్డ్ (Gold) బయటపడిందని అధికారులు తెలిపారు..
ఆ గోల్డ్ విలువ దాదాపుగా రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వాటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అతనిపై కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఈ ఫొటోలు, వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ (Viral News)గా మారాయి..