దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case) ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె పేరు ప్రధానంగా వినిపిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ((BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కువగా వినిపించక పోవడంతో బీఆర్ఎస్, బీజేపీ (BJP) మధ్య రహస్య ఒప్పందం జరిగిందనే గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి..
కానీ తాజాగా కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే (Ashwin Kumar Choubey) ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత కు ఇవాళో రేపో శిక్ష పడటం ఖాయమని షాకిచ్చారు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి ఎవరూ కాపాడలేరని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంను ఉద్దేశిస్తూ.. తెలంగాణ అభివృద్ధి చూసి ఢిల్లీలో అవార్డులు ఇస్తూ.. గల్లీలో అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ కుమార్ చౌబే కౌంటర్ ఇచ్చారు.
అవార్డులు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిపని చేసిందా.. కాదు కదా.. అందుకే వారికి జైళ్ళు ఇస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ కన్ను లిక్కర్ స్కామ్, కరప్షన్ మీద పడిందని ఆప్‌తో కుమ్మక్కై అవినీతికి పాల్పడిందని అశ్విన్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి స్కీమ్‌లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని.. బీజేపీ అధికారంలోకి వస్తే వారి ఆటలకు అడ్డుకట్ట పడుతుందని అశ్విన్ కుమార్ చౌబే అన్నారు..