అగ్రరాజ్యం అమెరికా (America)లో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సౌత్ కరోలినా ప్రైమరీలో జో బైడెన్ (Joe Biden) విజయం సాధించారు. దాదాపు 55 మంది డెలిగేట్లు ఈ పోటీలో పాల్గొన్నప్పటికి చివరికి బైడెన్ విజయాన్ని అందకున్నారు. కాగా మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు.

ఇందులో భాగంగా డెమొక్రాట్ల కోసం వారి అధ్యక్ష నామినేటింగ్ క్యాలెండర్లో పేర్కొన్న మొదటి పోటీలో, జో బిడెన్ సౌత్ కరోలినా ప్రైమరీలో భారీ తేడాతో గెలుపొందారు.ఈ గెలుపుతో బిడెన్ తనతో నల్లజాతి పౌరులు ఉన్నారని నిరూపించుకొన్నాడు. ఈ విజయంతో బిడెన్ వర్గంలో మరోసారి ఉత్సాహం నెలకొంది. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అవకాశం ఉన్న ప్రతీసారి వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేసుకొంటున్నారు. అంతకుముందు బైడెన్ మాట్లాడుతూ ఇది కేవలం ప్రచారం కాదని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రచారాన్ని మనం కోల్పోలేమన్నారు. ఏం జరుగుతుందో అమెరికన్లు అర్ధం చేసుకుంటారని వ్యాఖ్యలు చేశారు.