ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarkha) నివాళులర్పించారు. సికింద్రబాద్ మహబోధి విద్యాలయంలో ఆవరణలో ఉన్న గద్దర్ సమాధి వద్ధ భట్టి విక్రమార్క శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన గద్దర్ నివాసానికి వెళ్లారు. గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించారు.
ఈ సందర్బంగా గద్దర్ కుటుంసభ్యుల యోగక్షేమాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గద్దర్ భార్య విమల భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టిన ఆమెను భట్టి ఓదార్చారు. గద్దర్ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య , కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెల కోరారు. ఈ మేరకు భట్టి విక్రమార్కకు వినతి పత్రాన్ని అందజేశారు. భట్టి వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలు ఉన్నారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాన్ని అహింసా యుతంగా ముందుకు తీసుకు వెళ్లి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీని ఒప్పించడంలో అత్యంత కీలక పాత్ర ఆయన పోషించారు.