Telugu News » Ayodhya Ram Mandhir : గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా అయోధ్య…. రోజుకు 3 లక్షల మంది సందర్శకులు….!

Ayodhya Ram Mandhir : గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా అయోధ్య…. రోజుకు 3 లక్షల మంది సందర్శకులు….!

భవిష్యత్‌లో అయోధ్య గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

by Ramu

అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandhir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. రామ్ లల్లా’విగ్రహ ప్రాణప్రతిష్ట (Consecration) కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భవిష్యత్‌లో అయోధ్య గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

 

రాబోయే రెండు మూడేండ్లలో రోజుకు 3 లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పర్యాటక అవసరాలకు అనుగుణంగా నగరంలో రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు.

వాటికన్ సిటీ, కంబోడియా, జెరూసలేం, అలాగే భారత్‌లోని తిరుపతి, అమృత్‌సర్ వంటి పలు ప్రాంతాల్లో అధ్యయనం చేసిన తర్వాత అయోధ్యలోలో పట్టణ కోసం ప్రణాళిక రూపొందించామని అధికారులు చెబుతున్నారు. సమర్థవంతమైన భూ వినియోగం, కనీస రద్దీ, ధర్మశాలలు, హోమ్ స్టేలపై దృష్టి సారించడం, నగర చారిత్రాత్మక, సాంస్కృతిక స్వభావాన్ని నిలుపుకుంటూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారించి ఈ ప్రణాళిలకలను రూపొందిచామని ఆర్కిటెక్ట్ సీపీ కుక్రేజ వెల్లడించారు.

అయోధ్యలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ సంపదతో పాటు ఇతర వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ప్రపంచ పర్యాటక కేంద్రంగా అయోధ్యను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఇక ఇప్పటికే ఆలయానికి సంబంధించి ట్రస్టు విడుదల చేస్తున్న రామ మందిర ఫోటోలో ఆకట్టుకుంటున్నాయి.

You may also like

Leave a Comment