489
శ్రావణ మాసం రెండవ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయాలు రద్దీగా మారాయి.
ఈ క్రమంలోనే యాదాద్రి (yadadri)ఆలయానికి పోటెత్తారు. రెండవ శుక్రవారం సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చిన వారందరూ కూడా వారంతం కావడంతో స్వామి వారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు.
లక్ష్మీ నారసింహుని సన్నిధి ఈ సందర్భంగా భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
స్వామి కొండ మీద ఉన్న కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది. స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు.