తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ అర్బన్ బీజేపీ(BJP) అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) ఇంటి దగ్గర పోలీసుల హై డ్రామా కొనసాగింది.మంగళవారం ఉదయం సూర్యనారాయణ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లడానికి అనుమతి లేదని.. సూర్యనారాయణ ఇంటికి పోలీసులు నోటీసులు(Notiece) అతికించారు.
దీంతో ఏం జరుగుతుందోనని సూర్యనారాయణ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణలు ఒకరిపై ఒకరు భూ కబ్జా ఆరోపణలు చేసుకుంటున్నారు.
దీంతో ఇవాళ ఎమ్మెల్యే బిగాల గణేష్తో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కంఠేశ్వర్ ఆలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అందుకు సంబంధించిన నోటీసులను ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటికి అతికించారు.