భారత్‌లో ఎక్కువ మంది బంగారం కొనడానికి ఇష్టపడుతుంటారు. విదేశాల్లో మాత్రం ట్రెండ్ వేరు. అక్కడ ఎక్కువగా లగ్జరీ వస్తువులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా డైమండ్(Diamond)తో తయారైన వస్తువులంటే మరింత ఇష్టపడతారు. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల్లో మాత్రం డైమండ్ రింగ్‌లు ఇస్తుంటారు. ఈ తంతు ఎక్కువగా పెళ్లిళ్లలో కనిపిస్తుంది.
అయితే, అలాంటి డైమండ్ ధరలు(Diamond Prices) అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో వాటిని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు సరఫరాను నిలిపివేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తి సంస్థ డి బీర్స్ ధరలను పెంచేందుకు ముడి వజ్రాల సరఫరాను 35 శాతం, పాలిష్ చేసిన వజ్రాల సరఫరాను 20 శాతానికి పరిమితం చేసింది. రష్యాలోని అల్రోసా కూడా వజ్రాల విక్రయాలను నిలిపివేసింది.
వజ్రాల ధరలు తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే.. అందుకు సంబంధించిన రంగాల్లో మందగమనం కనిపిస్తోంది. వజ్రాభరణాలకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. దీంతో వజ్రాల ధరలు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. వజ్రాభరణాల కొనుగోలుకు గతంలో కంటే ఇప్పుడు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
మహమ్మారి కరోనా చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. దీంతో ఖరీదైన వస్తువుల కొనుగోలును తగ్గించుకున్నారు. దీంతో వజ్రాలకు డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. డిమాండ్ లేకపోవడంతో వజ్రాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆర్థిక సమీకరణలో రష్యా సామర్థ్యం ప్రభావితం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఏడాది క్రితంతో పోలిస్తే వజ్రాల డిమాండ్ 82 శాతం తగ్గింది. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, పరిస్థితుల కారణంగా లగ్జరీ వస్తువులకు డిమాండ్ ప్రభావితమైంది. వజ్రాల ధరలు పెరగడంతో డిమాండ్ పెరగాలని డైమండ్ కంపెనీలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ వజ్రాల వ్యాపారులు వాటి ధరలు తగ్గిన తరువాత రెండు నెలల పాటు వజ్రాల దిగుమతిని నిషేధించారు. ఉత్పత్తిదారులు నవంబర్, డిసెంబర్ వజ్రాల వేలాన్ని నిషేధించారు.