Telugu News » ఆఫ్ఘనిస్తాన్ తో పాక్ ఓటమి ముందే ఊహించిందా..? అందుకే ముందు ఇలా హింట్ ఇచ్చిందా..?

ఆఫ్ఘనిస్తాన్ తో పాక్ ఓటమి ముందే ఊహించిందా..? అందుకే ముందు ఇలా హింట్ ఇచ్చిందా..?

by Sravya

పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్ 2023లో వరుసగా మూడుసార్లు ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా సోమవారం చెన్నైలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్లు తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ లో పరవాలేదు అనిపించుకున్న పాకిస్తాన్ బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 253 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్కాన్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి స్కోర్ చేసేసింది. పాకిస్తాన్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నాro ఇప్పటికే మనందరికీ అర్థం అయిపోయింది ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులని చేసింది.

 ఈ ఓటమితో పాకిస్తాన్ తన సెమీస్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది. ఐదు మ్యాచ్లు ఆడిన బాబర్ సేన రెండు విజయాలతో ఐదవ స్థానంలో పాయింట్లు పట్టికలో ఉంది. ఇక వరుసగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీకు ఎందుకు ఇక ఆట వెంటనే ఫ్లైట్ ఎక్కి పాకిస్తాన్ వచ్చేయండి అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.

Also read:

పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ గురించి చూస్తే.. దక్షిణాఫ్రికా తో ఆడనుంది. అక్టోబర్ 27న దక్షిణాఫ్రికా తో పాకిస్తాన్ ఆడనుంది. ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు పిసిబి ఆఫ్ఘనిస్తాన్ ని బెంగళూరులో ఆస్ట్రేలియాని చెన్నైతో ఆడాలని ప్రపోజల్ తీసుకువచ్చింది కానీ ఐసీసీ దానిని రిజెక్ట్ చేసింది. ఎందుకు వెన్యూ మార్చమన్నారు అనేది ఇప్పుడు మనకి అర్థమైపోయింది. వాళ్ళు ఓటమిని ముందే గ్రహించారేమో..?

You may also like

Leave a Comment