తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.. కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి (Madhu Yashki) గౌడ్ నివాసంలో మాజీ ఎంపీలు (MP) సురేష్ షట్కర్, బలరాం నాయక్, రాజయ్య తదితరులు భేటీ అవడం పై ఎన్నో ఊహాగానాలు వార్తల రూపంలో బయటికి వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత లిస్ట్ లో పేర్లు లేని నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోన్ననేపథ్యంలో వీరి భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకోంది.
మరోవైపు మధుయాష్కీ ఎల్బీ నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, సురేష్ షెట్కర్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరు ఆశిస్తున్న స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు అధిష్టానం.
ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ వస్తుందో రాదో తెలియకుండా తికమకలో ఉన్నారని, అందువల్లే ఒకరి బాధను ఒకరు చెప్పుకోవడానికే మధుయాష్కి ఇంట్లో భేటీ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యమం సమయంలో పని చేసిన తమకు తొలి జాబితాలో టికెట్ కేటాయించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.. అయితే ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతుంటే ఇప్పటి వరకు హస్తానికి సేవ చేసిన నేతలకి గుర్తింపు లేక వాపోతున్నారని అనుకొంటున్నారు పార్టీ వర్గాలలోని కొందరు..