Telugu News » Vyooham Movie : పిటిషన్ డిస్పోస్.. వ్యూహం చిత్ర బృందానికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..!!

Vyooham Movie : పిటిషన్ డిస్పోస్.. వ్యూహం చిత్ర బృందానికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..!!

సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ అప్పీల్ చేసింది. సినిమా రిలీజ్ ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని వాదించారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం వాదనలు కొనసాగాయి.

by Venu
vyuham

రాంగోపాల్‌ వర్మ (Ramgopal Varma) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా (Vyooham Movie) విడుదలపై గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్ధత ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదంటున్నారు. ఈ సినిమా పై వివాదం రాజుకొన్న నేపథ్యంలో, తీర్పు పలు మలుపులు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా మూవీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కినట్టు ప్రచారం..

Lawyers protest against proposed shifting of Telangana HC

ఈ సినిమాలో TDP అధినేత చంద్రబాబు (Chandrababu)ను కించపరిచేలా చూపించారని, ఇటీవల నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆరోపించారు. ఈ మేరకు ‘వ్యూహం’ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికేట్‌ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ (Telangana) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో.. జనవరి 11 వరకు సినిమా విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ అప్పీల్ చేసింది. సినిమా రిలీజ్ ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని వాదించారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం వాదనలు కొనసాగాయి. అదీగాక ఈనెల 11కు బదులు 8 న, సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది. దీంతో ఎన్నికల ముందు మూవీ రిలీజ్ చేయాలని భావించిన వారికి మరోసారి నిరాశ ఎదురైంది.. మరోవైపు ఈ చిత్రం పై టీడీపీ నేతలు.. అభిమానులు మండిపడుతున్నారు.. ప్రజల్లో సింపతీ కోసం జగన్.. వర్మతో కలిసి సినిమా ప్లాన్ చేసినట్టు ఆరోపిస్తున్నారు..

You may also like

Leave a Comment