Telugu News » Britain : బ్రిటన్ లో ఘనంగా దీపావళి వేడుకలు..!!

Britain : బ్రిటన్ లో ఘనంగా దీపావళి వేడుకలు..!!

లండన్‌, వెస్ట్‌మినిస్టర్‌, డౌనింగ్‌ స్ట్రీట్‌లో (Downing Street) జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)‌తో పాటు ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) పాల్గొన్నారు. కాగా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు ప్రారంభించారు.

by Venu

దీపావళి వేడుకలకు జనం అంతా సిద్దం అవుతున్నారు.. ఆదివారం జరగనున్న ఈ వేడుకలను ఆనందోత్సహాల మధ్య చేసుకోవడానికి ప్రజలు ఉత్సాహపడుతున్నారు. అయితే యుకే లో మాత్రం ముందుగానే దీపావళి వేడుకలు నిర్వహించారు. యుకే ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు (Diwali celebrations) ఘనంగా జరుపుకున్నారు.

లండన్‌, వెస్ట్‌మినిస్టర్‌, డౌనింగ్‌ స్ట్రీట్‌లో (Downing Street) జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)‌తో పాటు ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) పాల్గొన్నారు. కాగా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దీప కాంతులతో ప్రధాని అధికారిక నివాసం నిండిపోయింది..

మరోవైపు ప్రధాని సునాక్‌ ఈ వేడుకలకు హాజరైన హిందూ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ.. హిందూ కమ్యూనిటీకి చెందిన అతిథులను ప్రధాని రిషి సునాక్‌ ఆహ్వానిస్తున్న పిక్ లు సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

You may also like

Leave a Comment