దేశమంతా దీపావళి(Diwali Festival) పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా ప్రముఖులు X(ట్విట్టర్) వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని మోడీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ ప్రతీఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా.’ అంటూ విష్ చేశారు.
అదేవిధంగా భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీపావళి పండుగ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఒక దీపం అనేక దీపాలను వెలిగించగలదు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సాయం చేయండి.. వారి ఆనందాన్ని అవసరమైన వారితో పంచుకోండి.. దీపావళి పండుగ మన మనస్సాక్షిని ప్రకాశవంతం చేస్తుంది.’ అని ముర్ము చెప్పారు.
అదేవిధంగా దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా.. హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యం ఉందని అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘చీకటిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు.