Telugu News » DMK : డీఎంకే బుద్ధి ఇంతేనా? హిందూత్వం అంటే అంత చులకనా..?

DMK : డీఎంకే బుద్ధి ఇంతేనా? హిందూత్వం అంటే అంత చులకనా..?

రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఓకేగానీ.. రాముడు, భరతమాత గురించి రాజా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

by admin

– రాముడు, భరతమాతను అంగీకరించం
– మేము రాముడి శత్రువులం
– నాకు రామాయణం తెలియదు
– రాముడిని నేను నమ్మను
– డీఎంకే ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు
– విద్వేష కుట్రలకు నిదర్శనమంటూ హిందూ సంఘాల ఆగ్రహం

ఇది హిందూ దేశం. హిందూవులు అత్యధికంగా ఉన్న పుణ్య ప్రదేశం. మన సనాతన ధర్మాన్ని, హిందూ ఆచారాలను విదేశీయులు సైతం పాటిస్తూ ధన్యులవుతున్నారు. కానీ, మన దగ్గరే ఉంటూ.. మనతోనే ఉంటూ హిందూ సంప్రదాయాలను చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా నోటికేదొస్తే అది అంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ ఎంపీ ఆండిముత్తు రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

DMK MP says Tamil Nadu will never accept Ram and Bharat Mata

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో ఉన్నాయి. ఈసారి బీజేపీకి కొన్ని సీట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్, డీఎంకే పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మధురైలో డీఎంకే నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు రాజా. బీజేపీ భావజాలమైన రాముడు, భరతమాతను తమిళనాడు ఎప్పటికీ అంగీకరించబోదన్నారు. రాముడికి శత్రువు ఎవరని ప్రశ్నించారు. రాముడు, సీతతో కలిసి అడవికి వెళ్ళాడని తన తమిళ గురువు చెప్పారని, ఆయన ఓ వేటగాడినని అంగీకరించాడని తెలిపారు. అలాగే సుగ్రీవుడు, విభీషణుడిని సోదరులుగా అంగీకరించాడన్నారు. అక్కడ కులమతాలు లేవని.. తనకు రామాయణం తెలియదని, అలాగే రాముడిని తాను నమ్మబోనని చెప్పారు.

భారత్ ఓ దేశం కాదని ఉపఖండమన్న రాజా.. ఒకే దేశం అంటే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి అని.. కానీ భారతదేశం ఒక దేశం కాదు, ఉపఖండం అని మాట్లాడారు. ఒక సమాజం గొడ్డు మాంసం తింటుంటే, దానిని గుర్తించాలని కోరారు. మణిపూర్‌లో ఎవరైనా కుక్క మాంసం తింటే, అది వారి సంస్కృతిలో భాగమని, మీ సమస్య ఏమిటి? వారు మిమ్మల్ని తినమని అడిగారా అని బీజేపీని ప్రశ్నించారు రాజా. లోక్‌ సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, కానీ డీఎంకే లేకపోతే భారత్‌ ఉండదన్నారు.

రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఓకేగానీ.. రాముడు, భరతమాత గురించి రాజా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భారతదేశ జీవన విధానానికి రామాయణం స్ఫూర్తిదాయకమని.. అలాంటి రాముడి గురించి నోటికొచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రల్లో భాగంగానే రాజా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నాయి. ఎంపీ హోదాలో ఉండి ఇది దేశం కాదు.. భరతమాతను అంగీకరించం అని మాట్లాడడం.. డీఎంకే హిందూ వ్యతిరేక భావజాలానికి నిదర్శనమని.. ఈసారి ఎన్నికల్లో హిందూవులు ఆపార్టీకి తగిన బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చాయి.

ఈ సందర్భంగా సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలనూ గుర్తు చేస్తున్నాయి. హిందూ సంఘాలు. హిందూ ఆచారాలను కించపరిచేలా మాట్లాడిన ఆయన తీరుపై ఈమధ్యే సుప్రీంకోర్టు మండిపడిందని గుర్తు చేస్తున్నాయి. అయినా, డీఎంకే నేతలకు బుద్ధి రావడం లేదని.. హిందూవులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నాయి హిందూ సంఘాలు.

ఇటు రాజా వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ప్రతిపక్ష ఐఎన్డీఐ కూటమిలోని డీఎంకే నేతలకు ఎప్పుడూ రెండు టార్గెట్లు ఉంటాయన్నారు. ఇలా మాట్లాడి సనాతన ధర్మాన్ని ద్వేషించే వాళ్ల పెద్ద నాయకులను శాంతింపజేయడం, ప్రజల సొమ్మును దోచుకోవడం. 2జీ స్కామ్ లో నిందితుడైన రాజా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని అవమానిస్తూనే ఉంటారని మండిపడ్డారు అన్నామలై. తాజాగా ఆయన మాటలు జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అని చెప్పే ప్రతీ భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని.. డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తోందని మండిపడ్డారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాగా మారిన డీఎంకే నేతలకు ‘ఛీ’, ‘ఇడియట్స్’ పేర్లు చక్కగా సరిపోతాయని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అన్నామలై.

You may also like

Leave a Comment