Telugu News » KCR : బీ‘ఆర్ఎస్ ప్రవీణ్’.. బడుగువాదం.. ఎటు పోయింది..? 

KCR : బీ‘ఆర్ఎస్ ప్రవీణ్’.. బడుగువాదం.. ఎటు పోయింది..? 

ఒకనాడు తెలంగాణ మ‌ర‌ణ‌శయ్య‌పై ఉంద‌ని.. ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ప్రశ్నించి.. దోపిడీదారుల‌కు అడ్డాగా మారింద‌ని.. కొంత‌మంది చేతుల్లో రాష్ట్రం బందీగా మారి పోయింద‌ని చెప్పిన మీరు.. వారితోనే చేతులు కలపడం ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.

by Venu

– కేసీఆర్ తో దోస్తీకి చేయి చాచిన ఆర్ఎస్పీ
– మొన్నటి దాకా అవినీతిపరుడు..
– రాష్ట్రాన్ని దోచేశారని విమర్శలు
– ఇప్పుడేమో నిజాయితీపరుడయ్యారా?
– మీ ఒక్కరికి ఎంపీ సీటిస్తే బడుగు, బలహీన వర్గాలు బాగుపడతాయా?
– ఆర్ఎస్ ప్రవీణ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పై ఏకధాటిగా విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్‌ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ప్రవీణ్.. పొత్తులపై చర్చించారు.

సెక్యులర్, లౌకిక పార్టీలు ఏకం ఆవుతున్నాయి.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. ఎవరు ఎన్ని సీట్లలో  పోటీ చేయాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు. ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు. కేసీఆర్ ను కలవటం ఆనందంగా  ఉందన్న ఆర్ఎస్పీ.. తమ స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధుతో దళితులను ఆదుకున్నారన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని.. కాంగ్రెస్, బీజేపీని దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఎస్పీ తరఫున నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని అంటున్నారు. అయితే.. ఆర్ఎస్పీ తీరుపై బడుగు బలహీన వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకనాడు తెలంగాణ మ‌ర‌ణ‌శయ్య‌పై ఉంద‌ని.. ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ప్రశ్నించి.. దోపిడీదారుల‌కు అడ్డాగా మారింద‌ని.. కొంత‌మంది చేతుల్లో రాష్ట్రం బందీగా మారి పోయింద‌ని చెప్పిన మీరు.. వారితోనే చేతులు కలపడం ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎంపీగా పోటీ చేసినంత మాత్రాన రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగినట్టా? అని ఆర్ఎస్పీని అడుగుతున్నారు.

You may also like

Leave a Comment