Telugu News » కార్తీకమాసంలో ఇలా చేస్తే… ఎన్నో జన్మల పాపలు తొలగిపోతాయి…!

కార్తీకమాసంలో ఇలా చేస్తే… ఎన్నో జన్మల పాపలు తొలగిపోతాయి…!

by Sravya
Karthika-Masam-2023

కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం అవ్వకుండానే నిద్రలేచి దీపారాధన చేయడం, నదీ స్నానం చేయడం, కార్తీక సోమవారాలు ఉపవాసాలు చేయడం ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ప్రతి నెలలో కూడా కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి కానీ కార్తీకమాసం అంతా కూడా ఎంతో మంచిది. ఈ నెల అంతా కూడా చాలా మంది తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం, దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కొన్ని దేవాలయాలను దర్శించుకుంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.

కార్తీక మాసంలో మీరు ఈ విధంగా ఆచరించినట్లయితే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయినికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఇక్కడ పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

Also read:

కార్తీక మాసం లో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది మొదట ప్రజాపిత బ్రహ్మ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాకాల దేవాలయం శాంతి భద్రతల పరిస్థితులను చూసేందుకు ఆరవదశబ్దంలో ప్రద్యుత్ రాజు యువరాజు కుమారసేనని నియమించినట్లు చరిత్ర చెప్తోంది. ఇక్కడ మరణిస్తే ఎంతో పుణ్యం అని కూడా అంటూ ఉంటారు. శివుడులో ఐక్యం కావాలనే కోరిక ఉన్న వాళ్ళు అందుకోసం ముందు ఏర్పాట్లు చేసుకుంటారు. అక్కడ మరణించాలని శివైక్యం చెందాలని అనుకుంటారు. అలా వాళ్ళు చనిపోయాక చితా బస్మాని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ బస్మహారతిని చూడాలంటే ముందుగానే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవాలి.

You may also like

Leave a Comment