Telugu News » Lunar Eclipse : రేపు చంద్ర గ్రహణం ఉందా-లేదా..?

Lunar Eclipse : రేపు చంద్ర గ్రహణం ఉందా-లేదా..?

హోలీ రోజున గ్రహణం పడుతుంది కదా అనే అనుమానాలతో పాటు.. గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రేపు ఆలయం మూసివేస్తారా? అంటూ పలు సందేహాలు భక్తులు వెల్లడిస్తున్నట్లు తెలిపారు..

by Venu

రేపు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుంది. అంతేగాక గ్రహణం రోజు ఏం చేయాలో.. ఏం చేయకూడదో వివరిస్తూ జనాన్ని అయోమయానికి గురిచేస్తున్నారు.. అయితే ఈ ప్రచారం పై చిలుకూరు బాలాజీ ఆలయం (Chilukuru Balaji Temple) పూజారి సీఎస్ రంగరాజన్ వివరణ ఇచ్చారు. రేపు మేం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తున్న వారికి పూర్తి క్లారిటీ ఇచ్చారు..

రేపు మనకు చంద్ర గ్రహణం లేదు అని సీఎస్ రంగరాజన్ (CS Rangarajan) స్పష్టం చేశారు. గ్రహణం ఉందని భయపడాల్సిందేమీ లేదని అన్నారు.. అదేవిధంగా ఈ చంద్రగ్రహణం అమెరికా (America), ఆఫ్రికా (Africa) దేశాల్లో రేపు కనిపిస్తుందని వివరించారు. అంతేగాక ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుందని తెలిపారు.. కానీ మనకు ఆ సమయంలో చంద్రుడు కనిపిస్తాడా? అంటూ ఆయన ప్రశ్నించారు..

మరోవైపు హోలీ రోజున గ్రహణం పడుతుంది కదా అనే అనుమానాలతో పాటు.. గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రేపు ఆలయం మూసివేస్తారా? అంటూ పలు సందేహాలు భక్తులు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.. ఇవన్నీ విన్నప్పుడు ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తారనే ఆశ్చర్యం కలుగుతుందని పూజారి సీఎస్ రంగరాజన్ అన్నారు.. ఇలాంటి ప్రచారాలు చేయడం యూట్యూబ్ చానల్స్ మానుకోవాలని సూచించారు..

అదేవిధంగా ఏవైనా గ్రహణాలు సంభవించే సూచనలుంటే.. పదిహేను రోజుల ముందు నుంచే పండితులు తెలియచేస్తారని రంగరాజన్ అన్నారు.. ఆ రోజు ఆలయాలు ఉంటాయా లేవా అనేది కూడా వెల్లడిస్తామని తెలిపారు.. అనవసరంగా భయాలు పెట్టుకోకండని సూచించారు.. అదేవిధంగా రేపు మనకు చంద్ర గ్రహణం లేదు కాక లేదు… భక్తులందరూ సంతోషంగా హోలీ పండుగ (Holi Festival) జరుపుకోండని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment