Telugu News » Ayodhya Ram Mandir : రామమందిర నిర్మాణంలో కీలక అప్డేట్.. అప్పటి వరకు పూర్తి కానున్న ఆలయం..!

Ayodhya Ram Mandir : రామమందిర నిర్మాణంలో కీలక అప్డేట్.. అప్పటి వరకు పూర్తి కానున్న ఆలయం..!

ప్రదక్షిణ మార్గం, మరో ఆరు దేవతలకు ఆలయాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులను ఇంతకుముందు వరకు 2000 మంది కూలీలు చేసేవారు. త్వరలోనే వీరి సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు.

by Venu
Ayodhya: The biggest festival in Ayodhya.. 24 hours Darshan Bhagyam..!

కోట్లాది హిందువుల కల అయోధ్య రామమందిరం నిర్మాణం.. ఈ ఆశ నెరవేరింది. కానీ నిర్మాణం (Construction) ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మందిరం నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం..

ayodhya all set for consecration ceremonyమరోవైపు గర్భగుడిలో రామ్ దర్బార్‌ (Ram Darbar)ను ఏర్పాటు చేయాలని భావించిన ఆలయ ట్రస్ట్.. ఇందుకు సంబంధించిన పనులను ఇప్పటికే రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ పనుల్లో వేగాన్ని పెంచేందుకు గాను ఎల్ అండ్ టీ, టాటా, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు తెలుస్తోంది. రామ మందిర నిర్మాణ సమయంలో కింద అంతస్తులో ఏర్పాటు చేసిన స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు సుమారు 200 మంది కళాకారులను నియమించారు.

అలాగే డిసెంబరు (December) నాటికి ఆలయ పనులను పూర్తి చేస్తామని అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. మరోవైపు మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 1200 మంది కార్మికులను మిగతా మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు నియమించారు. ఇక ఆలయ భద్రత కోసం 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మిస్తున్నారు.

ఆదేవిధంగా ప్రదక్షిణ మార్గం, మరో ఆరు దేవతలకు ఆలయాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులను ఇంతకుముందు వరకు 2000 మంది కూలీలు చేసేవారు. త్వరలోనే వీరి సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు. ఇదిలా ఉండగా వివిధ దేవతలకు చెందిన మొత్తం ఎనిమిది ఆలయాలను రామజన్మభూమి కాంప్లెక్స్‌లో నిర్మించనున్నారు. వీటన్నింటి నిర్మాణం పూర్తి కావడానికి మరో 18 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment