జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) లోని దోడా(Doda)లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. కిష్త్వార్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అస్సార్ ప్రాంతంలోని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరో 19మందికి గాయాలైనట్లు సమాచారం.
క్షతగాత్రులందరినీ కిష్త్వార్, దోడాలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ వీడియో వెలుగులోకి వచ్చింది. చాలా ఎత్తు నుంచి బస్సు పడిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.
లోతైన లోయలు ఉన్న కొండ ప్రాంతంలో బస్సు వెళ్తుండగా అదుపుతప్పి 300 అడుగులు ఉన్న లోయలో పడినట్లు సమాచారం. చాలా ఎత్తు నుంచి పడడంతో బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జితేందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
#WATCH | At least five people died in a bus accident in Assar region of Doda in J&K. Injured shifted to District Hospital Kishtwar and GMC Doda. Details awaited. pic.twitter.com/vp9utfgCBR
— ANI (@ANI) November 15, 2023
ప్రధాని మోడీ X(ట్విట్టర్) వేదికగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లోని దోడాలో బస్సు ప్రమాదం నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకుంటారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. అదేవిధంగా గాయపడిన వారికి రూ.50వేలు అందేలా చూస్తాం..’ అని ట్వీట్ చేశారు.
The bus accident in Doda, Jammu and Kashmir is distressing. My condolences to the families who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs.…
— PMO India (@PMOIndia) November 15, 2023