Telugu News » Donald Trump: చిక్కుల్లో డోనాల్డ్ ట్రంప్.. కోర్టులో చుక్కెదురు..!!

Donald Trump: చిక్కుల్లో డోనాల్డ్ ట్రంప్.. కోర్టులో చుక్కెదురు..!!

ట్రంప్‌పై మోపిన నేరారోపణలు కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీలు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి ట్రంప్‌నకు కోర్టులో చుక్కెదురైంది.

by Mano
Donald Trump: Donald Trump in trouble.. will be in court..!!

2020లో నిర్వహించిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేసేందుకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కుట్ర చేశారనే అభియోగాలను ఎదుర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ట్రంప్‌నకు కోర్టులో చుక్కెదురైంది. అయితే, ఫెడరల్ జడ్జి(Federal judge) తన్యాచుకుతాన్ ఆ పిటిషన్లను తిరస్కరించారు.

Donald Trump: Donald Trump in trouble.. will be in court..!!

ట్రంప్‌పై మోపిన నేరారోపణలు కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీలు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాయి. అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే, మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని, ఈ కేసులో విచారణ ఎదుర్కొవాల్సిందేనని జడ్జ్ రూలింగ్ ఇచ్చారు.

పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని జడ్జి పేర్కొన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి అధికారాల పరిధిపై న్యాయ పోరాటానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ తీర్పును ట్రంప్ న్యాయవాదులు అప్పీల్ చేసే అవకాశం ఉంది.

ట్రంప్‌పై 2021లో నాలుగు సార్లు నేరాభియోగాలు నమోదయ్యాయి. 2021, జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదైంది. అదేవిధంగా ఇరాన్ దాడికి సంబంధించిన అత్యంత రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిపెట్టారని, పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లింపులు చేశారని కేసులు నమోదయ్యాయి.

You may also like

Leave a Comment