అమెరికా అధ్యక్ష పదవి(US presidency) కోసం తన సొంత రిపబ్లికన్ పార్టీ(Republican Party) లోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్ నిక్కి హేలి(Indo-American Nikki Haley)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Former President Donald Trump) వ్యక్తిగత విమర్శలు చేశాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ హేళన చేశాడు.
విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావించాడు. ‘హేలి.. ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడు’ అంటూ ఎగతాళి చేశాడు ట్రంప్. దీనిపై స్పందించిన హేలి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్ ఇన్ చీఫ్గా ఉండే అర్హత లేదని దీటుగా జవాబిచ్చింది.
‘డొనాల్డ్ ట్రంప్.. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే నా వెనుక చెప్పకూడదు.. ఇద్దరం చర్చ పెట్టుకుందాం.. నువ్వు చెప్పాల్సిందేమన్నా ఉంటే అక్కడే నా ముఖం మీద చెప్పు..’ అని ఆమె అన్నారు. అదేవిధంగా 75 ఏళ్లు దాటిన రాజకీయవేత్తల మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించాలని తాను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నానని నిక్కీ హేలి పేర్కొన్నారు.
కాగా, నిక్కీ హేలి భర్త మేజర్ మైఖేల్ హేలి దక్షిణ కరోలినా నేషనల్ గార్డులో కమిషన్డ్ అధికారిగా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. కాగా ఎలాగైన అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతున్న డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత పార్టీ ప్రత్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు.