Telugu News » పంపిణీ అంత కూడా పారదర్శకంగా జరుగుతుంది: కేటీఆర్!

పంపిణీ అంత కూడా పారదర్శకంగా జరుగుతుంది: కేటీఆర్!

మిగతావి కూడా రాబోయే నెల, నెలన్నర కాలంలో ఇదే పద్ధతిలో.. ఇంతే పారదర్శకంగా మీ చేతులో పెడతాం. ‘ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

by Sai
dont-give-money-for-double-bedroom-house-says-minister-ktr-in-dundigal

డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వద్దని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీని కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 30 వేల ఇండ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తవుతుందని అన్నారు. మిగిలిన 70 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో పేదల చేతిలో పెడతామని తెలిపారు.

dont-give-money-for-double-bedroom-house-says-minister-ktr-in-dundigal

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెబుతుంటారు. సొంతంగా ఇల్లు కట్టాలన్నా.. ఇంట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలన్నా కష్టమని పాతకాలంలో ఈ సామెత చెప్పేవారు. కానీ ఇవాళ తెలంగాణలో అద్భుతమైన అనుభూతి కలుగుతోంది. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా.. ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్‌ అండగా ఉంటున్నరు.’ అని అన్నారు. ‘ దుండిగల్‌లోని 4వేల ఇండ్లు కట్టేందుకు ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఖర్చయ్యింది.

లక్ష ఇండ్లు హైదరాబాద్‌లో కడితే 9,718 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టేందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు పది లక్షలు. కానీ లక్ష ఇండ్ల మొత్తానికి మార్కెట్‌ విలువ 50వేల నుంచి 60 వేల కోట్ల వరకు ఉన్నది. ఆ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం పేదల చేతిలో పెడుతున్నది. ఒక్క రూపాయి లంచం చెల్లించాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా ఈ ఇండ్ల కేటాయింపులు చేశాం ‘ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మొదటి విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని వివరించారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ 126వ డివిజన్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు మొదటి విడతలో డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్‌లోనే బీజేపీ నాయకురాలు సునీతకు కూడా మొదటి విడతలోనే ఇల్లు వచ్చిందని తెలిపారు.

ఇవాళ దాదాపు 13,300 డబుల్‌ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. ఇవాల్టితో హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇండ్లలో 30వేల ఇండ్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుంది. మిగతావి కూడా రాబోయే నెల, నెలన్నర కాలంలో ఇదే పద్ధతిలో.. ఇంతే పారదర్శకంగా మీ చేతులో పెడతాం. ‘ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వకండి అని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. కేసీఆర్‌ ఆలోచన మేరకు ఈ ఒక్క రోజు 8 ప్రాంతాల్లో పంపిణీ చేసిన 13300 ఇండ్లలో దివ్యాంగులకు 470, దళితులకు 1,923.. గిరిజనులకు 655, మిగిలినవారికి 8652 పంపిణీ చేశామని తెలిపారు. పంపిణీ చేసినం. అని వివరించారు.

You may also like

Leave a Comment