ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆఘమేఘాల మీద రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వడంపై బీఎస్పీ(BSP) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటింగ్‌కు రెండు రోజుల ముందు బంధు సాయం విడుదలకు ఎలక్షన్ కమిషన్(EC) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే ‘రైతు బంధు’ ముసుగులో ఓటర్లను ప్రభావితం చేయడమేనని అభిప్రాయపడ్డారు.
రైతులకు పంట సాయంగా ఇచ్చే రైతుబంధు సాయం విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ తన x ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల ఓటింగ్‌కు రెండు రోజుల ముందు బంధు సాయం విడుదల చేసి 2018లోనూ ఓటర్లను ప్రభావితం చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రలోభాల్లో భాగంగానే ఈ చర్యకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.
డిసెంబర్‌లో విడుదల కావాల్సిన రైతు బంధు సడెన్‌గా నవంబర్‌లో ఎందుకు విడుదల చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం నవంబర్‌లోనే ‘రైతు బంధు’ సాయం విడుదలకు ఈసీకి బీఆర్ఎస్ లేఖ రాయడం నిజంగా స్వార్థపూరితం.’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల వేళ పథకానికి ఈసీ అనుమతి ఇవ్వడంపై అనుమానాలొస్తున్నాయని అన్నారు.
రుణమాఫీ నిధులు, ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన డీఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు బ్రేక్ వేసిందని ప్రశ్నించారు. వీరేం పాపం చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న ఈ నాటకాన్ని గమనించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలవుతున్నప్పుడు @ECISVEEP ఆఘమేగాల మీద రైతు బంధు సాయం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే "రైతు బంధు" ముసుగులో "ఓటర్ల" ను ప్రభావితం చేయడమే! 2018 లో కూడా ఇదే జరిగింది. ఇదీ రాజకీయ ప్రలోభాల్లో భాగంగానే అని #BSP భావిస్తుంది.
గత ఏడాది డిసెంబర్…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 25, 2023